తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి డిస్ట్రిక్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడిగా C&MD బుద్ధ ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక.భూపాలపల్లి ఏరియా నుంచి గ్రూప్ లీడర్లుగా వాసినేని శ్రీనివాసరావు, టీ. స్వామి ఎన్నిక. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించి డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సమావేశం కొత్తగూడెంలోని డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్స్ చిల్డ్రన్ పార్కులో నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (C&MD) బుద్ధ ప్రకాష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో భూపాలపల్లి ఏరియా నుంచి వాసినేని శ్రీనివాసరావును ఆర్ఎస్ఎల్ (RSL) వింగ్ గ్రూప్ లీడర్‌గా, టీ. స్వామిని స్కౌట్ వింగ్ గ్రూప్ లీడర్‌గా ఎన్నుకున్నారు.భూపాలపల్లి ఏరియా నుంచి మొత్తం ఐదుగురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ కార్యకలాపాలు, యువతలో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాల పెంపునకు చేపట్టే కార్యక్రమాల నిర్వహణలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ