Thursday, 05 November 2026 01:58:03 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

భగత్ సింగ్ జయంతి వేళ 1579వ మొక్క నాటి నివాళులర్పించిన విశ్వామిత్ర చౌహాన్.

Date : 29 September 2026 10:16 AM Views : 181

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణే తన బాధ్యతగా భావిస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజూ మొక్కలు నాటుతున్న విశ్వామిత్ర చౌహాన్ జిల్లా పంచాయతీ అధికారి అనూషతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తన 1579వ మొక్క పనస మొక్కను ఐ డి ఓ సి కార్యాలయపు ఆవరణలో నాటి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి అనూష మాట్లాడుతూ "23 ఏళ్ల చిన్న వయసులోనే దేశం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ త్యాగం వెలకట్టలేనిది. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే ఒక్క నినాదంతో యావత్ దేశ యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన గొప్ప సమరయోధుడు ఆయన. నేటి యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన దిశగా నడవాలి. చిన్న వయసులోనే పర్యావరణంపై ఇంతటి స్పృహతో విశ్వామిత్ర చేస్తున్న కృషి అభినందనీయం" అని కొనియాడారు. భగత్ సింగ్ జయంతి రోజున తనతోపాటు కలిసి మొక్క నాటి దేశభక్తితో పాటు పర్యావరణహితాన్ని చాటిన విశ్వామిత్ర చౌహాన్ ను జిల్లా పంచాయతీ అధికారి అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :