తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టీజీఎస్ ఆర్టీసీ మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్పై దాడి జరగడం, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూయడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ కొండంత అండగా నిలుస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ