తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బేతుపల్లి చెరువు వరద ఉధృతిలో చిక్కుకున్న 9 మంది మత్స్యకారులు, 10 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. ఎస్పీ రోహిత్ రాజు, కలెక్టర్ దివాకర్ రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించారు. సురక్షితంగా బయటపడిన వారందరినీ వైద్య పరీక్షల నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ