Wednesday, 04 November 2026 01:19:07 PM
# కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి.

కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్.

Date : 04 November 2026 01:11 PM Views : 28

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన. విధి నిర్వహణలో ఉంటూ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రవళిక పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ప్రవళిక తల్లిని పరామర్శించి, ఆర్టీసీ కుటుంబం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా న్యాయం చేస్తామని ప్రకటించారు. ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో పాటు ప్రభుత్వం & ఆర్టీసీ తరఫున ₹10 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామన్నారు. అలాగే ఆర్టీసీ తీసుకున్న ప్రత్యేక నిర్ణయం వల్ల బ్యాంక్ ప్రమాద బీమా కింద ఆ కుటుంబానికి ₹1 కోటి రూపాయల పరిహారం అందనుందని స్పష్టం చేశారు. ఆర్థికంగా అండగా నిలిచినా, కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన లోటును భర్తీ చేయలేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు:ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని మంత్రి తెలిపారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడిపై గతంలో నమోదైన హత్యాయత్నం కేసును ఇప్పుడు 'హత్య కేసు'గా మార్చి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, ప్రయాణికులకు సిబ్బంది వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప దాడులకు పాల్పడటం సరికాదని హితవు పలికారు.ప్రజాపాలన ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ వారి భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :