Thursday, 05 November 2026 01:57:40 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

వర్షాల నేపథ్యంలో 24 గంటలూ కంట్రోల్ రూమ్ అందుబాటులో: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 27 September 2026 12:09 PM Views : 106

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ మరో ఐదు రోజుల పాటు వర్ష హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఐడీఓసీలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఐడీఓసీలోని జి–19 గదిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08744-241950 నంబర్‌తో 24×7 అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వివిధ శాఖలకు చెందిన సిబ్బందిని మూడు షిఫ్టుల్లో విధులకు నియమించి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చే ప్రతి ఫోన్ కాల్‌ను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసి, సమస్యకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ అధికారులకు వెంటనే తెలియజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాలు, వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలు వర్షాలు, వరదలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో 08744-241950 కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :