Monday, 02 November 2026 05:33:15 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 31 October 2026 08:21 PM Views : 220

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్.సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్లాష్ వాక్ కొత్తగూడెంలోని పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు కొనసాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ విద్యార్థులు, యువతకు ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలు, ఆన్‌లైన్ వేధింపులు, స్టాకింగ్, సైబర్ బుల్లీయింగ్, నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, తెలియని వ్యక్తులు పంపే APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించారు.తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే నకిలీ పెట్టుబడి పథకాలు, ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో చేసే బెదిరింపులు, నకిలీ ఉద్యోగ ఆఫర్లు, లోన్ యాప్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ వివరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని పంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలని, సైబర్ వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ “ఆగండి – ఆలోచించండి – ధృవీకరించుకోండి” అనే సైబర్ భద్రతా సూత్రాన్ని పాటించాలని ఎస్పీ సూచించారు. ఏదైనా అనుమానాస్పద సందేశం లేదా లింక్ వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఆగి, దాని నిజానిజాలను ఆలోచించి, సంబంధిత వ్యక్తి లేదా సంస్థ వివరాలను ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలని తెలిపారు.సైబర్ నేరానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.సురక్షితమైన డిజిటల్ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ విషయాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, సీఐలు నరేష్, జితేందర్, వెంకటేశ్వర్లు, యాసీన్, ఇంద్రసేనారెడ్డి, పోలీస్ అధికారులు, సైబర్ వారియర్స్, సిబ్బంది, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :