Tuesday, 03 November 2026 09:17:32 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

సుజాతనగర్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయించా. త్వరలోనే పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 10 October 2026 06:17 PM Views : 279

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయించా. జీవో 187తో రూ.8.75 కోట్ల నిధులు.నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత ఇంగ్లీష్ విద్య.అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ వసతుల కల్పన.పట్టువదలకుండా ఎయిర్‌పోర్ట్ సాధిస్తాం. నాలుగు లైన్ల రహదారిగా సుజాతనగర్ రోడ్డు.మహిళల ఉపాధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.త్వరలోనే పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.సుజాతనగర్ మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైందని, దీని ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య చేరువవుతుందని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. సుజాతనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న విద్యా వసతుల కల్పన కోసం గత నెల రోజులుగా విద్యాశాఖ ఉన్నతాధికారులు, డైరెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరపడంతో జీవో నెంబర్ 187 ద్వారా పాఠశాల మంజూరైందని చెప్పారు. పాఠశాల అభివృద్ధి పనుల నిమిత్తం రూ.8.75 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగుతుందని, ప్రస్తుతం స్టేట్ సిలబస్‌తో మొదలై భవిష్యత్తులో సెంట్రల్ సిలబస్ (సీబీఎస్ఈ) ప్రవేశపెట్టే యోచన ఉందని స్పష్టం చేశారు. పాఠశాలలో అత్యాధునిక సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ గదులు, టాయిలెట్లు, 97 డ్యూయల్ డెస్క్ బెంచీలు, క్రీడా మైదానాలు నిర్మిస్తామన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేలా చర్యలు ఉంటాయన్నారు. రాబోయే నాలుగు-ఐదు రోజుల్లోనే ప్రజాప్రతినిధుల సమక్షంలో పాఠశాల పనులకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు గతంలోనే సూత్రప్రాయ ఆమోదం లభించినా, సాంకేతిక కారణాలు, భూసేకరణ ఆలస్యం వల్ల కొంత వెనుకబడిందని, పట్టువదలకుండా ప్రయత్నించి జిల్లాకు ఎయిర్‌పోర్ట్, పరిశ్రమలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నాయకులగూడెం నుంచి సుజాతనగర్ వరకు సెంట్రల్ లైటింగ్‌తో కూడిన నాలుగు లైన్ల రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. సుజాతనగర్ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడంతో పాటు పాత పంచాయతీ ఆఫీస్ స్థలంలో మోడల్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని తెలిపారు. మహిళలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు రవి, పాపారావులతో కలిసి 300 మందికి గృహ పరిశ్రమల ద్వారా పని కల్పిస్తున్నామని వివరించారు. ఈ ప్రాంతంలో కూరగాయలు, మిర్చి సాగు అధికంగా ఉన్నందున కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. సుజాతనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం కావడం, నాన్-షెడ్యూల్డ్ భూములు అందుబాటులో ఉండటంతో పారిశ్రామిక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజలు ఐక్యంగా సహకరించాలని కూనంనేని కోరారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, డీఈవో వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ లాల్ సింగ్ గ్రంధాలయ చైర్మన్ వీరబాబు, నాయకులు వాసిరెడ్డి మురళి భూక్య దస్రు, సిపిఐ మిత్రపక్షల నాయకులు కోమారి హన్మంతరావు, జక్కుల రాములు, రామ్మూర్తి, రాజగోపాల్, వెంకటేశ్వరరావు, ధర్మారావు, అజయ్, రాజశేఖర్, జగన్, కామేష్, ఉపేందర్, శ్రావణి, అనిత, రవి, పండు, తిరుపతిరెడ్డి, బందగి, రాంప్రసాద్, భద్రరావు, భూక్య శ్రీను, వెంకట్, అనిల్, మౌలానా, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :