Monday, 02 November 2026 11:30:50 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

అనారోగ్య కార్మికులను ఇబ్బందిపెట్టొద్దు. మెడికల్ అటెండెన్స్ నిబంధనలు మార్చాల్సిందే.ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య.

Date : 06 October 2026 08:51 PM Views : 157

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అనారోగ్య కార్మికులను ఇబ్బందిపెట్టొద్దు.. మెడికల్ అటెండెన్స్ నిబంధనలు మార్చాల్సిందే!.గతంలో మాదిరిగా ఇన్వాలిడేషన్ చేసి.. కార్మిక కుటుంబాలకు అండగా నిలవాలి – ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య.సింగరేణిలో మెడికల్ అటెండెన్స్ నిబంధనలను వెంటనే మార్చి,అనారోగ్య కారణాలతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు గతంలో మాదిరిగానే ఇన్వాలిడేషన్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.అనారోగ్య కారణాలతో పలువురు కార్మికులు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తమ వంతు వచ్చినప్పుడు బోర్డుకు హాజరయ్యేందుకు భయపడుతున్నారని తెలిపారు. అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ ‘ఫిట్‌ ఫర్‌ సేమ్‌ జాబ్‌’ అంటూ పంపిస్తున్నారనే ఆందోళన కార్మికుల్లో ఉందన్నారు.దీంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.గతంలో అనారోగ్యంతో విధులు నిర్వహించలేని కార్మికులను వివిధ రకాల అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఇన్వాలిడేషన్ చేసి, వారి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించే విధానం ఉండేదని గుర్తుచేశారు.అదే విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.మెడికల్ బోర్డుకు 100 మంది హాజరైతే అందులో కనీసం 10 శాతం మందిని కూడా ఇన్వాలిడేషన్ చెయ్యని పరిస్థితి కార్మికుల్లో ఆందోళనకు కారణమవుతోందన్నారు. తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కార్మికులను సైతం బోర్డు చుట్టూ తిప్పకుండా, గతంలో ఏరియా ఆసుపత్రుల్లో సీఏంఓ పరిధిలోని వైద్యుల ద్వారా ఇన్వాలిడేషన్ చేసిన విధానాన్ని అమలు చేయాలని కోరారు.29.01.1981లో మనుబోతుల కొమరయ్య ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాల కల్పనపై కుదిరిన ఒప్పంద స్ఫూర్తిని యాజమాన్యం కొనసాగించాలని మిరియాల రంగయ్య కోరారు. మెడికల్ ఇన్వాలిడేషన్ పేరుతో గతంలో కార్మికులను మధ్యవర్తుల ద్వారా గందరగోళానికి గురిచేసిన పరిస్థితులు పునరావృతం కాకుండా పారదర్శక విధానం అమలు చేయాలని సూచించారు.అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కార్మికులను మెడికల్ బోర్డు వరకు వేచి ఉండేలా చేయకుండా, గతంలో మాదిరిగా ప్రధాన ఆసుపత్రి ముఖ్య వైద్య అధికారి పరిధిలో వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించి ఇన్వాలిడేషన్ చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో మ్యాన్‌పవర్‌ సర్‌ప్లస్‌ ఉందని యాజమాన్యం చెబుతున్నప్పటికీ, ఏ ఏరియాలోనూ వాస్తవంగా సర్‌ప్లస్‌ మ్యాన్‌పవర్‌ లేదని మిరియాల రంగయ్య అన్నారు.అనారోగ్యంతో విధులు నిర్వహించలేని కార్మికులను ఇన్వాలిడేషన్ చేసి వారి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పిస్తే యువతకు ఉపాధి లభించడంతో పాటు కార్మిక కుటుంబాలకు భరోసా కలుగుతుందని తెలిపారు.కార్మికుల ఆరోగ్యం, కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ అటెండెన్స్ నిబంధనలను తక్షణమే సవరించి, గతంలో అమలు చేసిన విధానాన్ని పునరుద్ధరించాలని మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :