తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మైనింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు.అర్హతకు తగ్గ ఉద్యోగాలు, ప్రమోషన్లు, క్వార్టర్ల కేటాయింపుపై ఏఐటీయూసీ డిమాండ్.కొత్తగూడెం–సత్తుపల్లి మైనింగ్ స్టాఫ్ సంయుక్త సమావేశంలో అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య.మైనింగ్ స్టాఫ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. సమస్యలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా, ఉద్యోగుల అర్హతలు, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా న్యాయం చేయాలని కోరారు.ఆదివారం సాయంత్రం కొత్తగూడెం శేషగిరిభవన్‌లో కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త మైనింగ్ స్టాఫ్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మిరియాల రంగయ్య మాట్లాడుతూ.. మైనింగ్ స్టాఫ్ ఉద్యోగి అన్‌ఫిట్ అయిన సందర్భంలో అర్హతకు అనుగుణంగా సూటబుల్ జాబ్ కల్పించాలని కోరారు.ఓవర్‌మెన్, జూనియర్ మైనింగ్ ఆఫీసర్ల ప్రమోషన్లను వెంటనే పరిష్కరించాలని, ఉన్నత విద్యను అభ్యసించిన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఎన్‌ఓసీలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మైనింగ్ సర్టిఫికెట్లు సాధించిన ఉద్యోగులకు అర్హత ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్లు కల్పించాలన్నారు.మైనింగ్ స్టాఫ్‌ను వారి అర్హతలకు విరుద్ధంగా ఇతర పనులకు వినియోగించకుండా చూడాలని, భూగర్భ, ఉపరితల గనుల్లో పనిచేసే జ్యూరిస్డిక్షన్ ఇన్‌స్పెక్టర్ల ఏరియా పరిధిని స్పష్టంగా నిర్ణయించాలని కోరారు. వివిధ కారణాలతో నిలిపివేసిన లేదా కట్ చేసిన ఇంక్రిమెంట్లను పరిశీలించి అర్హులైన వారికి వెంటనే పునరుద్ధరించాలని అన్నారు.అదేవిధంగా మైనింగ్ స్టాఫ్ ఉద్యోగుల అర్హత, హోదాకు అనుగుణంగా క్వార్టర్ల కేటాయింపు చేయాలని, చదువుకున్న కార్మికులకు మైనింగ్ సూపర్‌వైజరీ స్టాఫ్‌గా పనిచేసేందుకు అవసరమైన శిక్షణ కల్పించాలని మిరియాల రంగయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా సమ్మె నోటీస్ పై సంధించిన హక్కులను యాజమాన్యంతో చేసుకున్న అగ్రిమెంట్లను వివరించారు.అనంతరం నూతన మైనింగ్ స్టాఫ్ కమిటీని ఎన్నుకున్నారు కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులుగా రాజారత్నం,కార్యదర్శిగా సాయి పవన్,సత్తుపల్లి ఉపాధ్యక్షులు గా సుశీల్ కుమార్,కార్యదర్శిగా సూర్యప్రకాష్ ను ఎన్నుకున్నారు,అదేవిధంగా కొత్తగూడెంలో 9మందితో,సత్తుపల్లిలో 9మంది తో కమిటీ వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి జి. వీరస్వామి, మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి వై. రాంగోపాల్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి. రమణమూర్తి, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జే. గట్టయ్య, ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, సత్తుపల్లి సహాయ కార్యదర్శి సూర్యప్రకాష్, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, పిట్ కార్యదర్శులు భూక్య రమేష్, కమల్, నర్సింగరావు,సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, మణుగూరు మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి సురేందర్, మైనింగ్ స్టాఫ్ ఉద్యోగులు, ముంజ శశికాంత్, ఇళ్ల గోపి,విక్టర్సన్, కే.వెంకటేశ్వర్లు,పి.శ్రీహరి, జి.విప్లవక్రాంతి,ప్రభాకర,శివప్రసాద్,గోపాల కృష్ణ,శ్రీధర్,మనోహర్, దుర్గాప్రసాద్,దినేష్,నాగరాజు,ఇబ్రహీం, రాకేష్,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ