తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో మీ సేవ, ఆధార్ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీ. ప్రభుత్వం నిర్దేశించిన రుసుములనే వసూలు చేయాలి: ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని మీ సేవ, ఆధార్ కేంద్రాలను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో TGTS జిల్లా మేనేజర్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, సేవల నిర్వహణ, నిర్ణీత సమయపాలన, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ పరిశీలించారు. మీ సేవ సేవలకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుములనే ప్రజల నుంచి వసూలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు రుసుములు (Excess Charges) వసూలు చేయరాదని కేంద్రాల నిర్వాహకులకు స్పష్టం చేశారు.మీ సేవ, ఆధార్ సేవల కోసం కేంద్రాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి అవసరమైన సేవలను సకాలంలో, సక్రమంగా అందించాలని సూచించారు. కేంద్రాలు నిర్ణీత పని వేళలను తప్పనిసరిగా పాటించాలని, సేవల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్రాల నిర్వహణ ఉండాలని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించే విధంగా వ్యవహరించకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ