Monday, 02 November 2026 07:00:20 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

శ్రీరామనవమికి ముందే భద్రాచలం ఆలయ పనులు పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Date : 23 September 2026 02:38 PM Views : 292

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి మూడు రోజులకు ఒక లిఫ్ట్‌ పనిని పూర్తి చేసేలా వేగం పెంచాలి రాతి పనులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ రోజువారీ లక్ష్యాలు నిర్దేశించాలి నాణ్యత, శాస్త్రోక్తత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ వద్దు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణతో పనులు నిర్వహించాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం భద్రాచలం చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదుపరి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజులతో కలిసి మంత్రి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉత్తర ద్వారం వద్ద ఉన్న దమ్మక్క విగ్రహం ప్రాంతం నుంచి పరిశీలన ప్రారంభించి, వివిధ నిర్మాణ పనుల పురోగతి, ప్రస్తుత దశ, పూర్తికి అవసరమైన సమయం, మానవ వనరులు, నిర్మాణ సామగ్రి తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భద్రాచలం సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లిఫ్టులు, స్లాబ్‌లు, రాతి పనులు, రహదారుల అభివృద్ధి, నిర్మాణ సామగ్రి లభ్యత, సిబ్బంది సమీకరణ, అదనపు నిధులు, సాంకేతిక సమన్వయం తదితర అంశాలపై పనుల వారీగా పురోగతిని పరిశీలించారు. ప్రతి విభాగానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించి, వారంవారీ ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.275 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే పనులు వేగం పుంజుకున్నాయని, నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో పూర్తి చేసేందుకు అధికారులు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు. శ్రీరామనవమికి ముందుగానే ప్రధాన పనులు పూర్తయ్యేలా రివర్స్ ప్లానింగ్ రూపొందించుకోవాలని, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయం, మాడ వీధులు, అంతర్గత ప్రాకారం, బాహ్య ప్రాకారం తదితర ప్రాంతాల్లో చేపడుతున్న పనులను ముందుగానే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఆలయ పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు. నిర్ణీత గడువులు, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సమన్వయంతో పనిచేసి పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్‌ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :