తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ, కో-ఆపరేటివ్ శాఖ, పీఏసీఎస్, బ్యాంకుల ఆధ్వర్యంలో ఐదో రోజు అట్ల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళా ఉద్యోగుల ఆటపాటలు, బతుకమ్మ పాటలతో వేడుకలు సందడిగా సాగాయి. తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ వేడుకలు చాటిచెప్పాయి.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ, కో-ఆపరేటివ్ శాఖ, పీఏసీఎస్, బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ