తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైటర్ బస్తీ 28వ డివిజన్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైటర్ బస్తీ 28వ డివిజన్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్ సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే వినాయకుని దయతో కొత్తగూడెం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. భక్తి శ్రద్ధలతో మండపాన్ని ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ