Monday, 02 November 2026 05:31:12 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

Date : 29 October 2026 07:55 PM Views : 86

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.ప్రజాస్వామ్య విలువలను కాలరాసే హక్కు ఎవ్వరికీ లేదు. ఓటు చోరీ క్షమించరాని నేరం.నవంబర్ 1న ఛలో ఢిల్లీ. జిల్లా నుండి 120 మంది.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.ఓటు చోరీ క్షమించరాని నేరమని, ప్రజాస్వామ్య విలువలను కాలరాసే హక్కుఎవ్వరికీ లేదని, ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టించిన ఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం సాగిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాష స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైధానంలో నిర్వహించే ర్యాలీ నిరసన కార్యక్రమానికి జిల్లా నుండి 120 మందితో కూడిన సిపిఐ ప్రతినిధి బృంధం తరలుతుందని చెప్పారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత కీలకమని, ప్రజా తీర్పును గౌరవించడం ప్రతీ వ్యవస్థ బాధ్యతన్నారు. ఓటు చోరీకి సంబంధించి విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలన్నారు. ఎన్నికల సంఘం పనితీరుపై సుప్రీం కోర్టు ఇప్పటికే మొట్టికాయ మొట్టిందని, న్యాయస్థానాల సూచనలను పరిగణలోనికి తీసుకుని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచాలన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం వామపక్ష శ్రేణులు ప్రజాసంఘాలు ఐ ఖ్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు రక్షణ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం కోసం తమ పోరాటం కొనసాగిస్తామని పాపా పేర్కొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :