Monday, 02 November 2026 09:57:21 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

కేంద్ర ఎన్నికల కమిషనర్ తక్షణమే వైదొలగాలి. బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులివ్వాలి.సాదిక్ ఫౌండేషన్ ప్రతినిధి సాదిక్ అలీ.

Date : 24 October 2026 05:32 PM Views : 95

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్ర ఎన్నికల కమిషనర్ తక్షణమే వైదొలగాలి. బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులివ్వాలి.ఓట్ల తొలగింపుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి.సాదిక్ ఫౌండేషన్ ప్రతినిధి సాదిక్ అలీ.కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, విద్యారంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలని సాదిక్ ఫౌండేషన్ ప్రతినిధి సాదిక్ అలీ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సాదిక్ ఫౌండేషన్ చేపట్టిన ప్రజా యాత్ర శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఘన స్వాగతం పలికింది. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్‌కే షాహిద్ అధ్యక్షతన ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యారంగ సమస్యలపై విద్యార్థులతో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాదిక్ అలీ మాట్లాడుతూ.. దేశంలో ఓటు హక్కు పరిరక్షణ అత్యంత కీలకమని, ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లను తొలగించారన్న ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించడంలో ఈసీ విఫలమైందన్నారు. విద్యకు పెద్దపీట వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలని, నిధుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్‌కే షాహిద్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రజాస్వామ్య మనుగడ ఓటు హక్కు పరిరక్షణతో ముడిపడి ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలపై ఎన్నికల సంఘం జవాబుదారీతనంతో వ్యవహరించి పూర్తి విచారణ చేపట్టాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అజిత్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మల్లెల రామనాధం, తెలంగాణ జన సమితి నాయకులు దేవదానం, నభి, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు, కళాబృందం సభ్యులు స్వామి, శ్రీనివాస్, ఎల్లేష్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :