తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ విభాగాల్లో సదుపాయాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మంగళవారం నాడు ఓఎస్డీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, ఆయుధ కర్మాగారాలు, ఆయుధ కర్మాగార వర్క్‌షాప్, వ్యాయామశాల, సిబ్బంది బ్యారక్స్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో సిబ్బందికి అందుతున్న వసతి, పరికరాలు, పరిశుభ్రత, నిర్వహణ తీరును పరిశీలించి అధికారులతో చర్చించారు. మరమ్మతులు అవసరమైన ప్రాంతాలను గుర్తించి, అవసరమైన సదుపాయాల కల్పనకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.డాగ్ స్క్వాడ్‌లో జాగిలాల ఆరోగ్యం, ఆహారం, వసతి, శిక్షణ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. నేరాల ఛేదనలో జాగిలాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు క్రమం తప్పకుండా శిక్షణ, ప్రాక్టీస్ నిర్వహించాలని సూచించారు. బాంబ్ డిస్పోజల్ టీమ్ వద్ద ఉన్న పరికరాలు, భద్రతా సామగ్రిని పరిశీలించి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. ఆయుధ కర్మాగారాలు, వర్క్‌షాప్‌లో ఆయుధాల నిర్వహణ, మరమ్మతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.వ్యాయామశాలను సందర్శించి, సిబ్బంది శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. అనంతరం బ్యారక్స్‌ను పరిశీలించి తాగునీరు, పరిశుభ్రత, వసతి వంటి అంశాలను సమీక్షించారు.మరమ్మతులు అవసరమైన ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టి, సిబ్బందికి మెరుగైన వసతి, పని వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ విభాగాలకు సంబంధించిన భవనాలు, పరికరాలు, ఇతర వనరులను సక్రమంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ