తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్, సీసీ కెమెరాల నియంత్రణ గది, రికార్డింగ్ వ్యవస్థ, విద్యుత్ బ్యాకప్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని అధికారులను ఆదేశించారు. గోడౌన్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమతి లేని వారిని లోపలికి రానివ్వకూడదని స్పష్టం చేశారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లను పరిశీలించి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధు, తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ