Tuesday, 03 November 2026 07:48:00 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

Date : 30 October 2026 05:11 PM Views : 81

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.రైతు వేదిక స్థలంలో ఇంటి పట్టాలా?లక్ష్మణ్ అగర్వాల్ కుటుంబ సభ్యుల,స్నేహితుల ఇంటి పట్టాల దరఖాస్తులు రద్దు చేయాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.76 జీవోలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలని,కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్ అగర్వాల్ కుటుంబ సభ్యులు,స్నేహితుల ఇంటి పట్టాల దరఖాస్తులు తిరస్కరించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు కాంగ్రెస్,సిపిఐ పార్టీల రాజకీయ నాయకులతో,ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై లక్షల రూపాయలతో ఇంటి పట్టాలు మాట్లాడుకుని,కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.గతంలో ఐదవ వార్డు గంగాబిషన్ బస్తీలో కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులు,స్నేహితులు ఎనిమిది మందితో సుమారు 5,175 గజాలకు దరఖాస్తు చేసుకొనగా వాటిని రెండుసార్లు తిరస్కరించడం జరిగిందని అంతకు పూర్వం సదరు స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే 2019లో నాటి కలెక్టర్ రజత్ కుమార్ షైనీ అట్టి నిర్మాణాలను కూల్చివేసి అక్కడ రైతు వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.మరల అట్టి స్థలంలో దరఖాస్తులపై విచారణ జరిపించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.అదేవిధంగా గతంలో గొల్లగూడెం 16వ వార్డు నందు సుమారు 1500 గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టగా నాటి తహసీల్దార్ అట్టి నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందని మరల ఇప్పుడు 1500 గజాలకు ముగ్గురు పేర్లపై కమ్యూనిస్టు నాయకుడు ఇంటి పట్టాలకు దరఖాస్తులు చేయించింది వాస్తవం కాదా అని నిలదీశారు!??అదేవిధంగా ఎంజీ రోడ్డులో దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి విషయమై హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా అట్టి స్థలానికి కూడా దరఖాస్తులు చేయడం,దానికి రెవెన్యూ అధికారులు సహకరించడం సరైనది కాదన్నారు.జలగం వెంకట్రావు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కొత్తగూడెం పట్టణంలో ప్రభుత్వ స్థలాలపై ఎన్ని బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది,ఇప్పుడు అట్టి స్థలాలలో ఎన్ని స్థలాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి,ఎన్ని స్థలాలు కబ్జాలకు గురి అయ్యాయో ఎమ్మెల్యే కూనంనేని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.జిల్లా అధికారులు స్పందించి గతంలో తిరస్కరించబడి మరల ఇప్పుడు విచారణ చేపడుతున్న ఇంటి పట్టాల దరఖాస్తులపై ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,బీమా,మురళి,కార్తీక్,అనిత తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :