తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాలకులు కృషి చేయాలి.ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా జర్నలిస్టుల పాత్ర కీలకం.త్వరలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి. ఇప్పటికే గుర్తించిన వది ఎకరాల స్థలానికి త్వరలో రక్షణ గోడ.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా కోరారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమరశంఖంలో భాగంగా ఐడిఓసి సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి షాషా హాజరయ్యారు. టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాగు వెంకటరత్నం, జునుమాల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు వెలుగులోనికి తీసుకొచ్చే జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజా స్వామ్యానికి నాల్గో స్తంభంగా నిలుస్తూ నిత్యం ప్రజల వక్షాన నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమం భద్రత హక్కుల పరిరక్షణకై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని, జర్నలిస్టుల జీవన ప్రమణాలు మెరుగుపడేలా ప్రభుత్వాలు సంక్షేమ చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన నాడే నిజమైన హక్కులను పాలకులు కాపాడినట్లు అవుతుందని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ లో పలుమార్లు ప్రస్థావించారని చెప్పారు. సింగరేణి హెడ్ ఆఫీస్ ప్రక్కకు 10 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టుల ఇళ్ల కాలనీకి ఇచ్చేందుకు సిద్ధం చేసి పెట్టామని, ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు కోసం ఆ స్థలాన్ని వినియోగించాలని చూసినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ స్థలాన్ని జాగ్రత్త చేస్తున్నామని తెలిపారు. ఎన్ని సమస్యలున్నా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపై అనేక వార్తలు రాస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో రాజకీయ పార్టీలన్నీ చిత్తశుద్ధితోనే ఉన్నాయని, బిపిఎల్ కోటాలో ఆ స్థలాన్ని కేటాయించేందుకు కృషి జరుగుతోందన్నారు. జర్నలిస్టుల సంఘాలు ఒక ప్రత్యే కమిటీగా ఏర్పడి అర్హులైన వారందరి పేర్లతో జాబితాను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అనంతరం మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల సమస్య త్వరలో ఓ కొలిక్కివ వచ్చే అవకాశం ఉందన్నారు. కేటాయించిన స్థలానికి ముందుగా రక్షణ కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, జర్నలిస్టు సంఘాలన్నీ ఒక తాటిపైకి రావాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవిలక్ష్మీ ప్రనన్న మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, తాను స్వయంగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత పాలకులు వదేళ్లపాటు జర్నలిస్టుల సమస్యలను గాలికొదిలేశారని యద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, బిఆర్ఎస్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ , బిజేపి, జైభీమ్రావ్ భారత్ పార్టీ ప్రతినిధులతో పాటు ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు దుద్దుకూరి రామారావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు నవీన్, నాగచంద్ర, ప్రింట్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు వందా సత్యానంద్, శంకర్, చంద్రశేఖర్, డివిజన్ అధ్యక్షులు అబ్బురామ్, కార్యదర్శి నక్క శ్యామ్సన్, పినపాక నియోజకవర్గ కార్యదర్శి బర్ల జోషి, జులూరుపాడు మండల కార్యదర్శి సిహెచ్ నర్సింహారావు, జిల్లా, డివిజన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ