తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వచ్ఛ ఆటో డ్రైవర్ శ్రీహరి మృతి బాధాకరం. కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటాం. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్.మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 58వ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆటో డ్రైవర్ శ్రీహరి ఆకస్మిక మరణం తీవ్ర విచారకరమని, వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కొత్తగూడెం నగర మేయర్ మూడ్ గణేష్ పేర్కొన్నారు. చుంచుపల్లి మండలం గాంధీ కాలనీ నివాసి, కార్పొరేషన్ స్వచ్ఛ ఆటో డ్రైవర్ కె. శ్రీహరి (38) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ వెంటనే మృతుడి స్వగృహానికి చేరుకుని, పార్థివదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజారోగ్యం కోసం శ్రమిస్తూ పారిశుద్ధ్య విభాగంలో సేవలందించిన నిబద్ధత కలిగిన కార్మికుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తామని, అకాల మరణం చెందిన శ్రీహరి కుటుంబాన్ని కార్పొరేషన్ తరఫున ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతుడి భార్య, వృద్దురాలైన తల్లిని పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని చెబుతూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నివాళులర్పించిన వారికి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గెడ్డాడు నగేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, చుంచుపల్లి మండల సిపిఐ కార్యదర్శి వాసిరెడ్డి మురళి నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కార్మికుడి మృతిపట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ