తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? ఎంప్లాయిస్ యూనియన్ కూటమి విజయం ఖాయం.కార్మికుల పక్షాన నిలిచే ఈయూ, ఎన్ఎంయూ పట్టం.ఆర్టీసీ కార్మికుల భద్రతకు, సంస్థ పరిరక్షణకోసం పోరాడతాం.ప్రభుత్వంలో విలీనమే ప్రధాన అజెండాగా ఉద్యమిస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ)లో కార్మికుల ఉద్యోగ భద్రత, న్యాయమైన హక్కుల సాధనే ధ్యేయంగా రాజీలేని ఉద్యమాలు సాగిస్తామని, ఈ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఎంప్లాయిస్ కూటమి విజయం తథ్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిపోల వద్ద సిపిఐ అనుబంధ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి ఏర్పాటు చేసిన ఎన్నికల శిబిరాలను సాబీర్ పాషా సందర్శించి సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు డిపోల్లో గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా జరిగిందని మొత్తం 857 మంది ఓటర్లలో డిపోలవారీగా కొత్తగూడెంలో 176కి 173మంది కార్మికులు, భద్రాచలంలో 333కి 317మంది, మణుగూరులో 241కి 227, ఇల్లందులో 107కి 102 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 70 శాతం మేర కార్మికులు ఇయు కూటమి వైపు మొగ్గు చూపారని మిగిలిన పోస్టల్ బ్యాలెట్స్ సైతం ఈయూ కూటమికి అనుకూలంగా ఉంటుందన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఆర్టీసీని, శ్రమజీవులైన కార్మికులను తీవ్ర నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. విలీన ప్రక్రియ డిమాండ్‌ను సాధించడం, పెండింగ్ వేతనాల సవరణ, ఉద్యోగ భద్రత వంటి సమస్యలపై నిరంతరం పోరాడిన చరిత్ర తమ సంఘానికి ఉందని గుర్తుచేశారు. నిరంతరం కార్మికులకు అండగా ఉంటూ సేవలు అందించిన సంఘాలవైపే కార్మికులు మొగ్గు చూపారని, రాష్ట్రంలో గుర్తింపు సంఘంగా ఎంప్లాయిస్ యూనియన్, ఖమ్మం రీజియన్‌లో ప్రాతినిధ్య సంఘంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినా కార్మిక ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, జి వీరాస్వామి, వాసిరెడ్డి మురళి, కొమారి హన్మంతరావు, నేరెళ్ల రమేష్, భూక్య శ్రీనివాస్, వంగ వెంకట్, గెడ్డాడు నగేష్, జక్కుల రాములు, కె రత్నకుమారి, ధనలక్ష్మి, రాజేశ్వరరావు, పైడిపల్లి లక్ష్మి, కార్పొరేటర్లు, నాయకులు నజీర్, అప్పారావు, ఎండి యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, బండి నర్సింహా, గుర్రం వెంకటేశ్వర్లు, దారావత్ దినేష్, నామా వినోద్, ధర్మరాజు, సత్యనారాయణచారి, షాహీన్, అంకుష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ