Tuesday, 03 November 2026 12:12:49 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు.

Date : 02 November 2026 06:12 PM Views : 60

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.రూ.18 వేలు ఇవ్వకుంటే పోరాటం తప్పదు. రూ.13 వేలతో ఇల్లు గడవడం ఎలా సాధ్యమో చెప్పండి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. నాసిరకం సరుకుల టెండర్లు రద్దు చేయాలి.అదనపు పనిభారం మోపితే ఊరుకోబోం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.ఐసిడిఎస్ సమ్మె, కలెక్టరేట్ ముట్టడి విజయవంతం.అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల వేళ సీఎం ఇచ్చిన రూ.18,000 వేతన పెంపు హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలతో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి, మహాధర్నా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రగతిలో భాగస్వాములవుతూ మాతాశిశు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ శిశు, గర్భిణుల మరణాల నివారణకు అంగన్వాడీలు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తున్న రూ.13 వేల వేతనంతో కుటుంబం బ్రతకడం సాధ్యం కాదని, సామాన్య కార్మికుల వేతనాల పెంపుపై నిర్లక్ష్యం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రాల అద్దెలు, గ్యాస్, ఆరోగ్యలక్ష్మి పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకుండా తాత్సారం చేయడం దుర్మార్గమన్నారు. కేంద్రాలకు నాణ్యతలేని సరుకులు సరఫరా చేస్తున్న టెండర్లను రద్దు చేసి శనగలు, కారం, చింతపండు, గుడ్లు నాణ్యమైనవి పంపిణీ చేయాలని, టీచర్లపై బలవంతంగా రుద్దుతున్న బీఎల్‌వో డ్యూటీలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు పీఎఫ్, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తూ ఆయాలకు కనీసం రూ.10 వేల వేతనం అందించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఖాళీగా ఉన్న గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా సంక్షేమ శాఖ అధికారి తారకు అందజేశారు. ​ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య వేల్పుల మల్లికార్జున్, భూక్యా శ్రీనివాస్, రెడ్డి అరుణ, విజయ, భారతి, సంధ్య, ఇందిర, మీనాకుమారి, కృష్ణకుమారి, సమ్మక్క, చిన్నారి, శ్రీదేవి, సునీత, సరస్వతి, సుజాత, శోభారాణి, గుర్రం వెంకటేశ్వర్లు, ప్రసాద్, అన్నారపు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :