Monday, 02 November 2026 05:31:28 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

పామాయిల్ గెలల అక్రమ తరలింపు కేసులో 9 మంది అరెస్ట్.2 ఆటోలు, పామాయిల్ గెలలు, నగదు స్వాధీనం.

Date : 03 October 2026 01:09 PM Views : 8636

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, దమ్మపేట పోలీసులు పామాయిల్ గెలలను అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ముఠాపై చర్యలు చేపట్టి 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా పామాయిల్ గెలలను ఫ్యాక్టరీలకు తరలించే సమయంలో, యజమానులకు తెలియకుండా కొంత మొత్తంలో పామాయిల్ గెలలను మార్గమధ్యంలో దించి అక్రమంగా తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గత నాలుగు నెలలుగా బుగ్గపాడు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బత్తిన రాము, ట్రాక్టర్ డ్రైవర్లు గడ్డం మహేంద్ర, కీసరి నాగరాజు, నాగబాబు తదితరులు వివిధ గ్రామాల నుంచి పామాయిల్ గెలలను అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలకు తరలించే సమయంలో కొంత భాగాన్ని మార్గమధ్యంలో దించి, యజమానులకు తెలియకుండా అక్రమంగా తరలించి విక్రయించినట్లు విచారణలో తేలింది.అదేవిధంగా, కనితి లక్ష్మీనారాయణ అక్రమంగా సేకరించిన పామాయిల్ గెలలను కనితి శివ, వంక చందు తమ ఆటోల ద్వారా అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి తరలించడంలో సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పొట్ట ముత్యాలరావుతో పాటు మరికొందరికి కూడా సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే జక్కా బాలు, కారం వెంకటేష్, చి. పుల్లారావు తమ F-Codeలను ఉపయోగించి పామాయిల్ గెలల విక్రయాలకు సహకరించడంతో పాటు, వాటి ద్వారా జరిగిన నగదు లావాదేవీల్లో భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.నిందితులు పరస్పరం సమన్వయంతో పామాయిల్ గెలలను అక్రమంగా తరలించి, విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి, 2 ఆటోలు, పామాయిల్ గెలలు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.పామాయిల్ గెలలను అక్రమంగా తరలించడం, దొంగతనం చేయడం, F-Codeలను దుర్వినియోగం చేయడం లేదా ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు సహకరించడం చట్టపరంగా నేరమని పోలీసులు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ దర్యాప్తులో అశ్వారావుపేట సీఐ పి. నాగరాజు, దమ్మపేట ఎస్‌ఐ బాలస్వామి మరియు దమ్మపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :