Monday, 02 November 2026 06:15:28 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు, శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 22 September 2026 06:26 PM Views : 193

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిమజ్జన శోభాయాత్రలు జరిగే ప్రధాన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.భద్రాచలం నిమజ్జనం ఘాట్ వద్ద పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఘాట్ పరిసరాల్లో పోలీస్ సిబ్బందిని అధిక సంఖ్యలో మోహరించి, రద్దీ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్, శోభాయాత్రల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల మళ్లింపు, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.శోభాయాత్రల్లో డీజేలు, అధిక శబ్దాన్ని కలిగించే సౌండ్ సిస్టమ్స్, టపాసులకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని, నిమజ్జన సమయంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు, రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన నీటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో బ్లూకోట్స్, మొబైల్ పెట్రోలింగ్, ట్రాఫిక్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీస్, అగ్నిమాపక, వైద్య, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు.గణేష్ మండపాల నిర్వాహకులు, శోభాయాత్ర నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, శోభాయాత్ర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.గణేష్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :