తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉల్లాసంగా జిల్లా సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పొటీలు ప్రారంభించిన నాగా సీతారాములు యాదవ్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఒలింపిక్ జెండాను ఊపి పరుగు పందెం పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా నాగా సీతారాములు యాదవ్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. చిన్న వయసు నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, బాలురతో పాటు బాలికలు కూడా అధిక సంఖ్యలో అథ్లెటిక్స్‌లో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొనడం ఆనందదాయకమన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.అథ్లెటిక్స్ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మహీధర్ రెడ్డి, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్ మందుల వెంకటేశ్వర్లు, అథ్లెటిక్స్ కోచ్ డి. మల్లికార్జునరావు, కోచ్‌లు ఎం. నాగరాజు, పి. నాగేందర్, జె. గిరిప్రసాద్, షేక్ రియాజ్ పాషా, కిన్నెరసాని ప్రసాద్, ఐటీడీఏ అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్ నారాయణ, ఈశ్వర్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రెజరర్ బి. హనుమంతరావు, మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మంజులాల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ