తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కొండంత అండ. సీఎంఆర్‌ఎఫ్ ఆపదలో ఉన్న బాధితులకు ఆసరా.ఆడబిడ్డల పెళ్లిళ్లు పేద కుటుంబాలకు భారం కావద్దు. సీఎంఆర్‌ఎఫ్ సాయం మరింత సులభతరం చేయాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ వంటి పథకాలు నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో సోమవారం నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూనంనేని ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు ఆయా కుటుంబాలకు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకాలు అమలవుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో ఈ సాయం అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అదేవిధంగా తీవ్రమైన రోగాల బారినపడి వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడే బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ భరోసానిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద కొత్తగూడెం-34, లక్ష్మీదేవిపల్లి-33, సుజాతనగర్-9 చొప్పున మొత్తం 76 మంది లబ్ధిదారులకు రూ.76,08,816 విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. అలాగే సీఎంఆర్‌ఎఫ్ కింద నియోజకవర్గ పరిధిలోని 85 మంది బాధితులకు రూ.32,16,500 విలువైన చెక్కులు, ఇతర జిల్లాలకు చెందిన 96 మందికి తన సిఫారసుతో మంజూరైన రూ.38,33,750 చెక్కులను పంపిణీ చేశామన్నారు. మొత్తం 181 మంది లబ్ధిదారులకు రూ.70,49,250 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించినట్లు వివరించారు. మేయర్ మూడ్ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ లాల్ సింగ్, చైర్మన్ మండే హనుమంతరావు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, తహసిల్దార్ కృష్ణ ప్రసాద్, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు బండి నరసింహా, బోయిన విజయ్ కుమార్, కంచర్ల హిమశ్రీ, దర్గయ్య, యూసుఫ్, దావూద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ