తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శనివారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, పాల్వంచ పరిధిలోని 2వ డివిజన్ కార్పొరేటర్ భవిత కిరణ్ గారు మరియు 45వ డివిజన్ కార్పొరేటర్ నరేష్ ఆహ్వానం మేరకు మండపాలలో వెలసియున్న దుర్గా అమ్మవారి మండపాలను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగసీతారాములు యాదవ్ సందర్శించారు.ఈ సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు,42వ డివిజన్ కార్పొరేటర్ భవానీ మణి ,రవి దంపతులు,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దొప్పలపుడి సురేష్, యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ