Monday, 02 November 2026 09:05:47 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి.

Date : 02 November 2026 05:56 PM Views : 20

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌-2026) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలి. ఏఎస్‌డీ (ASD) & డిలీషన్ జాబితాల క్షుణ్ణ పరిశీలన:ఏఎస్‌డీ జాబితా: గైర్హాజరు (Absent), చిరునామా మార్పు (Shifted), మరణించిన వారు (Dead) జాబితాలోని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలతో ధ్రువీకరించాలి. పేర్ల తొలగింపు (Deletion): సరైన విచారణ మరియు పక్కా ఆధారాలు లేకుండా ఏ ఒక్క అర్హుడైన ఓటరు పేరును జాబితా నుండి తొలగించకూడదు. పేరు తొలగింపునకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలి. నోటీసులు అందుకున్న ప్రతి ఓటరుకు తమ వాదన వినిపించేందుకు తగిన అవకాశం కల్పించాలి.వివిధ ఫారాల (Forms) పరిష్కారం:ఫారం-6: కొత్త ఓటరు నమోదు దరఖాస్తులు. ఫారం-7: ఓటరు పేరుపై అభ్యంతరాలు లేదా పేరు తొలగింపు దరఖాస్తులు.ఫారం-8: చిరునామా మార్పులు, ఓటరు వివరాల సవరణ దరఖాస్తులు.ఈ ఫారాల ద్వారా అందిన అన్ని దరఖాస్తులను ఎలాంటి పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.రికార్డుల నిర్వహణ & స్పీకింగ్ ఆర్డర్లు (Speaking Orders):ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, మార్పులకు సంబంధించి అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయానికి స్పష్టమైన కారణాలను పేర్కొంటూ 'స్పీకింగ్ ఆర్డర్లు' జారీ చేయాలి.ప్రతి కేసుకు సంబంధించిన నోటీసులు, విచారణ నివేదికలు, ఓటర్లు సమర్పించిన ఆధారాలను భవిష్యత్తు అవసరాల కోసం క్రమపద్ధతిలో భద్రపరచాలి.ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :