Monday, 02 November 2026 09:57:20 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

పేద విద్యార్థులకు తోడ్పాటు అభినందనీయం : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Date : 02 October 2026 05:24 PM Views : 140

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 'దాసరి లక్ష్మి' కుటుంబ సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శం విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి విద్యార్థినుల ఉన్నత ఎదుగుదలకు తోడ్పడే సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఆదర్శనీయమని, విద్యార్థులు తమకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చుంచుపల్లి మండల పరిధిలోని ఎస్ ఆర్ డి జి పాఠశాలలో స్వర్గీయ దాసరి లక్ష్మి జ్ఞాపకార్థం సంక్షేమ వసతి గృహ విద్యార్థినులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి లక్ష్మి కుమారుడు దాసరి వెంకటేశ్వర్లు, కోడలు దాసరి కృష్ణవేణి సమకూర్చిన వస్త్రాలను విద్యార్థినులకు ఆయన అందజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ.. పేద విద్యార్థులు కష్టపడి చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడమే నిజమైన విజయమన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని వేళలా నాణ్యమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. ఆయా హాస్టళ్లలో మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం, పౌష్టికాహారంతో పాటు ఉత్తమ విద్యా సౌకర్యాలు నిరంతరం అందేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాల పిల్లలకు ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఇటువంటి పనులకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వర్క అజిత్, ఎస్ కే షాహేద్, జిల్లా నాయకులు ఎం వినయ్, సంజయ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :