Thursday, 05 November 2026 01:58:13 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులు నమోదు చేసుకోవాలి : అదనపు కలెక్టర్ వేణుగోపాల్

Date : 29 September 2026 07:36 PM Views : 191

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.ఓటర్ల జాబితా ప్రక్రియలో రాజకీయ పార్టీలు సమన్వయంతో సహకరించాలి. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో నమోదు ప్రక్రియపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, అర్హతలు, దరఖాస్తు విధానం, గడువును పూర్తిగా అవగాహన చేసుకుని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే పట్టభద్రులు ఫారం–18 ద్వారా అవసరమైన వివరాలను సమర్పించాలని తెలిపారు. సంబంధిత ధ్రువపత్రాలను గెజిటెడ్ అధికారి లేదా డిజిగ్నేటెడ్ అధికారి ద్వారా ధ్రువీకరించి సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు.నవంబర్ 1, 2023 నాటికి పట్టభద్రులై ఉండటంతో పాటు, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో స్థానిక నివాసులుగా ఉన్న అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ఓటర్ల జాబితాలో పేరు ఉండటం మాత్రమే ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియకు సరిపోదని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఎన్నికల సంఘం సూచించిన విధానంలో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా జరిగేలా సంబంధిత అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. అర్హులైన పట్టభద్రులకు ఓటరుగా నమోదు చేసుకునే ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎలక్షన్స్ సిబ్బంది నవీన్, బీజేపీ ప్రతినిధి బి. రవి నాయక్, కాంగ్రెస్ ప్రతినిధి లక్ష్మణ్ అగర్వాల్, బీఆర్‌ఎస్ ప్రతినిధి అన్వర్, ఎస్. ఆనుదీప్, సీపీఐ(ఎంఎల్) ప్రతినిధి బాబూరావు, బీఎస్పీ ప్రతినిధి టి. వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :