తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 2024-25 సంవత్సరానికి గాను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన 5 బొగ్గు గనులు ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు సాధించాయి. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని అభినందించారు.మైనింగ్ పద్ధతులు, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంలో సింగరేణి చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన ప్రశంసించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ