తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అక్టోబర్ 12 వ తేదీ, సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10గంటలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని ఆయన సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం సబ్ కలెక్టర్ కార్యాలయం భద్రాచలం మరియు ఆర్డీవో కార్యాలయం కొత్తగూడెంలో ప్రజావాణి నిర్వహించబడుతుందని, అదేవిధంగా జిల్లాలోని అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆయన అన్నారు. కావున ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ