తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీనగర్ ఐదవ వీధిలో గల శ్రీ లక్ష్మీ గణపతి మండపం లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రం నీలాద్రి ఆలయ చైర్మన్ చీకటి నరసింహారావు.అనంతరం నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవ కమిటీ సభ్యులు చైర్మన్ నరసింహారావు శాలువాతో సత్కరించి ప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక వార్డు సభ్యులు లగడపాటి రమేష్ చంద్, వట్టికొండ. సాంబశివరావు, పాపారావు, మురళి, కోడూరి. రమేష్, జగన్ మోహన్ బండారి, వీర చారి, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ