తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి పెన్షన్ పొందుతున్న వితంతుల ఆసరా పెన్షన్ అర్హతలో సడలింపు ఇవ్వాలని కొత్తగూడెం కార్పొరేషన్ మేనేజర్ ప్రసాద్ కి సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందించిన అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో కష్టపడి దాచుకున్న సొమ్ములో పొందుతున్న దానిని రెండో పెన్షన్ అనురాధని అది కేవలం దాసుకున్న సొమ్ము మాత్రమే అని అన్నారు. సింగరేణిలో 5000 పెన్షన్ పొందుతున్న వారికి కూడా ఆసరా పెన్షన్ పొందేందుకు అర్హత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రగతి కోసం భూగర్భంలో పనిచేసి అలసి, సొలసిపోయి రిటైర్డ్ అయిన తర్వాత చాలీ చాలని సింగరేణి పెన్షన్‌తో వారు జీవిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరి పట్ల సామాజిక కోణంలో ఆలోచించి కనీసం నెలకు 3,000 రూ పొందుతున్న వారి కైనా అర్హత కల్పించి వారి దరఖాస్తులను ఆమోదించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ