Thursday, 05 November 2026 01:57:41 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలకు 31 మంది నామినేషన్లు

Date : 24 September 2026 08:31 PM Views : 146

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలకు 31 మంది నామినేషన్లు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికలను నిర్వహించేందుకు జె. సునిత,చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌ను ఎన్నికల అధికారిగా (Election Officer) నియమించడం జరిగింది.ఎన్నికల ప్రక్రియలో భాగంగా 24.09.2026 వరకు మొత్తం 35 మంది అభ్యర్థులకు నామినేషన్ ఫారాలు అందజేయడం జరిగింది. అందులో 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.నిర్దేశించిన ఎన్నికల విధి విధానాల ప్రకారం ప్రతి అభ్యర్థి రూ.10,000/- (రూపాయలు పది వేల) నాన్-రిఫండబుల్ డిపాజిట్ చెల్లించి నామినేషన్ దాఖలు చేశారు. ప్రతి నామినేషన్‌కు భారత రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన ఇద్దరు సభ్యులు మద్దతుదారులుగా సంతకాలు చేశారు.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల అధికారి పర్యవేక్షణలో పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. తదుపరి నామినేషన్ల పరిశీలన (Scrutiny), చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితా ప్రచురణ తదితర ఎన్నికల ప్రక్రియలు నిర్దేశించిన షెడ్యూల్ మరియు నియమావళి ప్రకారం నిర్వహించబడతాయి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :