తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావును సింగరేణి మారుపేర్ల బాధితులు కలిశారు. దసరా కానుకగా 15 రోజుల్లో వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించినా, గడువు ముగిసినా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నియామక పత్రాలు ఇప్పించాలని కోరారు. వీరిలో శ్రావణ్ గౌడ్, రంజిత్, భాగ్యశ్రీ, సురయ్య, లచ్చు, రమేష్ తదితరులు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ