Tuesday, 03 November 2026 12:52:06 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

గణేష్ నిమజ్జన ఊరేగింపులో తల్వార్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన నలుగురు రిమాండ్. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ.

Date : 25 September 2026 07:14 PM Views : 421

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణేష్ నిమజ్జన ఊరేగింపులో తల్వార్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన నలుగురు రిమాండ్.ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు: కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ.గణేష్ నిమజ్జన ఊరేగింపులో మారణాయుధమైన తల్వార్‌ను ప్రదర్శిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించి, భయభ్రాంతులకు గురిచేసిన నలుగురు వ్యక్తులను కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.23.09.2026న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో గరీబ్‌పేట గ్రామంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా, గరీబ్‌పేటకు చెందిన చిత్తరి లింగాప్రసాద్ చేతిలో తల్వార్ పట్టుకుని జన సమూహంలో తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినట్లు పోలీసులకు సమాచారం అందింది. అతనితో పాటు పల్లె సతీష్, గోగుల నవీన్, నందతండాకు చెందిన భూక్య గణేష్లు కూడా ఊరేగింపులో పాల్గొంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్లు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా, పోలీసులను గమనించిన నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నలుగురిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగల సందర్భంగా మారణాయుధాలను ప్రదర్శించడం, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం, భయభ్రాంతులకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :