తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షురాలు తోటా దేవీప్రసన్న అధ్యక్షతన జరిగింది.ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఖమ్మం లోక్‌సభ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణుల సమన్వయం, ఎన్నికల నిర్వహణలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు యాదవ్ తో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ