తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో ఏఐటీయూసీ నిరంతర పోరాటం. కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల్లో ఏఐటీయూసీ జెండాలను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటాలు చేస్తోందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడం, కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించడం లక్ష్యంగా సేవ్ సింగరేణి జాతా, హెడ్ ఆఫీస్ ముట్టడి, జెన్కో ముట్టడి వంటి కీలక ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు.ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా గుర్తింపు సంఘంగా కార్మికులకు ప్రయోజనం చేకూర్చే 24 కీలక ఒప్పందాలు కుదిరేలా కృషి చేశామని వెల్లడించారు. సొంత ఇంటి పథకం, పెర్క్స్‌పై పన్ను వంటి ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా ఒప్పందాలు సాధించామని తెలిపారు. ఈ ఒప్పందాలను క్షేత్రస్థాయిలో అమలు చేయించి కార్మికులకు పూర్తి ప్రయోజనాలు అందేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.అలాగే కార్మికులకు దీపావళి బోనస్, లాభాల వాటా సాధించడంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఏఐటీయూసీ నిరంతర పోరాటాలు, కార్మికుల ఐక్య పోరాటాల ఫలితంగానే నేడు సింగరేణి కార్మికులు దీపావళి బోనస్‌తో పాటు లాభాల వాటా పొందుతున్నారని తెలిపారు. కార్మికులకు రావాల్సిన ప్రతి హక్కు, ప్రయోజనం అందే వరకు ఏఐటీయూసీ పోరాటం ఆగదని అన్నారు.కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. కార్మికులకు నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలను ఐక్యం చేస్తూ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కార్మికులు సాధించుకున్న హక్కులను కాపాడుకోవడంతో పాటు మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం కోసం నిరంతరం ఉద్యమిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య, ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, ఆఫీస్ బేరర్స్ ఎస్. నాగేశ్వరరావు, హుమాయూన్, హీరాలాల్,గుమ్మడి వీరయ్య,పిట్ కార్యదర్శులు భూక్యా రమేష్, మధుకృష్ణ, కమల్, మెంగన్ రవి,సురేందర్, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి సాయి పవన్, నాయకులు సందీప్, సాంబమూర్తి, మురళి, రామచందర్, సురేందర్ రెడ్డి, శశివర్ధన్ రెడ్డి, సంజీవ్,గుమ్మడి మురళి,అప్పారావు,రాజేందర్,కరుణాకర్,కోటి,ప్రభాకర్,ఓదెలు,కుమారరావు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ