Tuesday, 03 November 2026 12:12:49 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

మారెళ్లపాడు లిఫ్ట్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 23 న మంత్రుల చేతుల మీదగా ప్రారంభోత్సవం.

Date : 21 September 2026 08:40 PM Views : 164

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మారెళ్లపాడు లిఫ్ట్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.ఈ నెల 23 న మంత్రుల చేతుల మీదగా ప్రారంభోత్సవం.16,180 ఎకరాలకు సాగునీరు. తీరనున్న దశాబ్దాల రైతుల కల. ఎమ్మెల్యే పాయం ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మంత్రి తుమ్మల.ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. గోదావరి జలాలను ఆయకట్టుకు తరలించే మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. . స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు పాల్గొనున్నారు..రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇప్పటికే ట్రయల్‌రన్‌ విజయవంతం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.వరప్రదాయినిగా మారెళ్లపాడు,సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు. మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. పథకంలో భాగంగా హెడ్‌వర్క్స్‌కు రూ.25 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.113.17 కోట్లు, భూసేకరణకు రూ.42.30 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.రూ.25 కోట్లతో పంప్‌హౌస్‌ మెఘా ఇంజినీరింగ్‌ సంస్థ రూ.25 కోట్లతో పంప్‌హౌస్‌ నిర్మాణాన్ని చేపట్టగా, పనులు దాదాపు పూర్తయ్యాయి. 1.80 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటార్ల ద్వారా 46 మీటర్ల ఎత్తు నుంచి 85 మీటర్ల ఎత్తు వరకు, అంటే సుమారు 39 మీటర్ల మేర 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. పంప్‌హౌస్‌ నుంచి 2.4 కి.మీ. దూరంలో కొండ కింద డెలివరీ సిస్టర్న్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నీరు కాలువల్లోకి చేరుతుంది.కాలువలు.. ఆయకట్టు వివరాలు సిస్టర్న్‌ నుంచి 10.070 కి.మీ. మేర రెండు ప్రధాన కాలువలు నిర్మించాల్సి ఉంది. 9.650 కి.మీ. పొడవైన కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 420 మీటర్ల ఎడమ కాలువ ద్వారా తుమ్మల చెరువు నిండనుండగా, దాని కింద ఇప్పటికే ఉన్న 4,266 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మొత్తం 16,180 ఎకరాల్లో సుమారు 11 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు కావడం విశేషం.తొలిదశలో 7 వేల ఎకరాలు ప్రధాన కాలువ పనులు ప్రస్తుతం టెండర్‌ దశలో ఉన్నాయి. అందుకే తొలిదశలో లిఫ్ట్‌ ద్వారా తుమ్మల చెరువుకు నీటిని తరలించి, ఆ చెరువు కింద 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. మరో 2 వేల ఎకరాలకు కూడా నీరందుతుంది. కాలువ పనులు పూర్తయితే మొత్తం 16,180 ఎకరాలకు నీరు అందుతుంది.తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు లబ్ధిఈ పథకం ద్వారా తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు ప్రయోజనం చేకూరనుంది. అమెర్దాలో 1,877, అమ్మగారిపల్లిలో 958, అశ్వాపురంలో 2,474, గొందిగూడెంలో 8, కేశవాపురంలో 23, కుమ్మరిగూడెంలో 90, నెల్లిపాకలో 4,281 ఎకరాలకు సాగునీరు అందనుంది.మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధప్రాజెక్టు ప్రతిపాదనల దశ నుంచి పనుల పురోగతి వరకు మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ చూపారు. పనుల పరిశీలనకు ఇప్పటివరకు అనేక సార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన చొరవతో పనులు వేగంగా పూర్తయి ట్రయల్‌రన్‌ సఫలమైంది. ఎమ్మెల్యే పాయం పర్యవేక్షణమంత్రి సూచనల మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పనులను నిరంతరం పర్యవేక్షించారు. దాదాపు 20 రోజుల పాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే ఉండి, ఎదురైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దీంతో నిర్దేశిత గడువులోగా ట్రయల్‌రన్‌ పూర్తయింది.రైతన్నల్లో హర్షంగోదావరి జలాలు కాలువల్లోకి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలతో బీడు భూములు పచ్చని పొలాలుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :