Tuesday, 03 November 2026 12:12:50 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి: డీఆర్వో పద్మావతి.

Date : 22 September 2026 06:18 PM Views : 176

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి: డీఆర్వో పద్మావతి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో భద్రతా చర్యలు వేగవంతం చేయా లి. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదవుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతి చెందిన వారు, గాయపడిన వారి వివరాలతో పాటు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు.జనవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు జిల్లాలో మొత్తం 370 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదాల్లో 176 మంది మృతి చెందగా, 23 మంది తీవ్రంగా, 344 మంది స్వల్పంగా గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని డీఆర్వో పద్మావతి సూచించారు.సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు జిల్లాలో 21 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. ఈ ప్రమాదాల్లో 12 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా, 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. మరో 17 మంది ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఇటీవలి కాలంలో ప్రమాదాల పరిస్థితిని పరిశీలించి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్వో సూచించారు.జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్డు భద్రతా చర్యలను తక్షణమే చేపట్టాలని ఆమె ఆదేశించారు. అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్, రిఫ్లెక్టర్లు, వీధి దీపాలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లపై ఉన్న ప్రమాదకర మలుపులు, కూడళ్లు, ఇతర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు.వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఆర్వో పద్మావతి సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదాలకు కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు భద్రత విషయంలో సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రమాదాల సంఖ్యను, మృతి, గాయాల సంఖ్యను తగ్గించేలా చర్యలు చేపట్టాలని డీఆర్వో పద్మావతి పేర్కొన్నారు.ఈ సమావేశంలో డీఎస్పీ వెంకన్న బాబు, డీఆర్‌ఎం బాలాజీ, ఆర్‌అండ్‌బీ ఈఈ, డీఈఈ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, రవాణా శాఖ ఏఎంవీఐ, పోలీస్ సీఐ రాజు, మున్సిపల్ కమిషనర్ సంబంధిత శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :