తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మారుమూల గ్రామాల రోడ్ల సమస్యను పరిష్కరించాం. ప్రజారవాణా ఆర్టీసీని ప్రజలు ఆదరించాలి. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. పాల్వంచ-దంతలబోర ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే. హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ జనం. ప్రతి పల్లెకు ప్రజారవాణా ఆర్టీసీ ప్రయాణ సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం అని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మంగళవారం మండల పరిధిలోని నారాయణరావుపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాల్వంచ-దంతలబోర ఆర్టీసీ బస్ సర్వీసులును లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలుత జండా ఊపి బస్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రధాన రోడ్ల సమస్యను పరిష్కరించామని అతి త్వరలో అంతర్గత రోడ్లు పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజా రవాణా ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని, ఆర్టీసీ బస్సులు సురక్షితంగా ప్రయాణించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా కాంగ్రెస్ నాయకులు నాగసీతారాములు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, సంఘము సర్పంచ్, బానోతు రవి, నారాయణరావుపేట సర్పంచ్ బండి సరస్వతి, దంతలబోర్ సర్పంచ్, నాయకులు బానోతు రంజిత్, ప్రేమచంద్, ప్రశాంత్, సాయిలి శ్రీను, ch.శ్రీను, సాయిలి ఎంకన్న, వెల్లంకి శివరావు, సత్యనారాయణ రాజు, మేక రాంబాబు, గ్రామ పెద్దలు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ