Tuesday, 03 November 2026 08:41:01 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

జిల్లాలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 12 October 2026 05:23 PM Views : 849

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సోమవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరాల గుర్తింపు, దర్యాప్తును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, పోలీస్ స్టేషన్లలోని కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ప్రస్తుతం మొత్తం 467 సీసీటీవీ కెమెరాలను ఈ కేంద్రానికి అనుసంధానం చేయడంతో జిల్లాలో నిఘా వ్యవస్థ మరింత బలోపేతమైంది.ఈ వ్యవస్థ ద్వారా ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, నేరాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడం సులభతరం కానుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, నేరాల నియంత్రణలో సీసీటీవీ నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :