తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు తక్షణం పూర్తి చేయాలి... సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డి. ఆర్. యు. సి.సి నెంబర్, డిసిసి అధికార ప్రతినిధి వై.శ్రీనివాస్ రెడ్డి. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ కొత్తగూడెం ఏరియాకు ఏరియా ఆఫీసర్ గా ఐఆర్ఎస్ మహారాష్ట్ర కేడర్ కు చెందిన కులకర్ణి సుభాష్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు డి ఆర్ యు సి సి మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే చాలువతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పటం జరిగింది.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు గత నాలుగు సంవత్సరాలుగా నత్త నడక నడుస్తున్నాయని తక్షణమే పనులు పూర్తి చేసి రానున్న గోదావరి పురస్కారాల నాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.కరోనాలో రద్దు అయిన కొత్తగూడెం టు కాజీపేట ట్రైన్,కొత్తగూడెం టు డోర్నకల్ ట్రైన్, కొల్హాపూర్ బెల్గావి ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరణ చేయాలని విన్నవించారు.ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత భక్తులు ప్రజల చిరకాల కోరిక అయినా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయంనుండి కలియుగ దైవమైన తిరుపతికి టెంపుల్ టు టెంపుల్ కుప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేయాలని కోరారు. కొత్తగూడెం నడిబొడ్డులో ఉన్న రాజీవ్ పార్క్, ఎన్జీవోస్ కాలనీ, ప్రగతి మైదాన్ వెళ్లే దారి గత 100 సంవత్సరాలు పైగా తాత ముత్తాతల కాలం నుండి ఉందని దానిని మూసి వేయడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ఆ దారిని రీఓపెన్ చేపించాలని విజ్ఞప్తి చేశారు. పాండురంగాపురం టు సారపాక వరకు మంజూరైన రైల్వే లైన్ పనులను సెంట్రల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగా ప్రారంభించి పూర్తి చేపించేలా కృషి చేయాలని, అదేవిధంగా బొగ్గుట్టగా పేరుగాంచిన ఇల్లందుకు తిరిగి రైలు సౌకర్యం కల్పించాలని ఏవో కు వినతి పత్రం అందించారు. ఏవో కులకర్ణి సుభాష్ మాట్లాడుతూ.. కొత్తగూడెం ప్రాంత ప్రజల రైల్వే సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ