Monday, 02 November 2026 07:00:18 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రకృతితో మమేకమైన మహోన్నత పండుగ. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 19 October 2026 10:58 AM Views : 109

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రకృతితో మమేకమైన మహోన్నత పండుగ.శ్రమజీవుల ఐక్యతకు పల్లె సంబరాలే నిదర్శనం.పూల వేడుకలతో గ్రామీణ సంస్కృతికి జీవం.సంప్రదాయాలను భావితరాలకు అందించాలి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.పూలను పూజించి ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక అని, గ్రామీణ శ్రమజీవుల ఐక్యతకు ఈ సంబరాలు నిదర్శనమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం పట్టణ పరిధిలోని బస్తీలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆటపాటలతో జరుపుకుంటున్న వేడుకలను ఆయన నేరుగా సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్సీబీ నగర్, పాత కొత్తగూడెం, విద్యానగర్, శ్రీనగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన ఘాట్లను సందర్శించి, సామూహిక బతుకమ్మల నిమజ్జనోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె పండుగలు మానవ సంబంధాలను బలోపేతం చేస్తాయని, ఆడపడుచుల ముఖాల్లో ఆనందం నింపే ఇలాంటి మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని, పండుగ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ​కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ప్రజాప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :