Tuesday, 03 November 2026 12:12:50 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం.

Date : 09 October 2026 07:26 PM Views : 510

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం. లక్ష్మిదేవి మండలం జయశంకర్ కాలనీ వాసి మైనర్ బాలిక (7) కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుండి 8/10/2026 ఉదయం 11 గంటలకు తప్పిపోయింది. బాలిక తండ్రి కొత్తగూడెం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, మూడవ పట్టణ పోలీస్ అధికారులు వెంటనే రంగంలో దిగి సిసి కెమెరాలు ఆధారంగా ఆచూకీ కోసం రెస్క్యు ప్రారంభించారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ బానోత్ సందీప్, టీం సభ్యులు గాడిద భవానీ, ఆవునూరి భావన, దేవరకొండ రంజీత్ గాలింపు చర్యలు చేపట్టారు. కొత్తగూడెం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాలతో , పోలీస్ సిబ్బంది మరియు ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా టీం చేసిన ప్రయత్నాలు ఫలించి మైనర్ బాలిక ఆచూకీ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు రామవరం లో గుర్తించారు. బాలికను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు హజరు పరుచగా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రా దేవి మహమ్మద్ సాదిక్ పాషా బాలికను తండ్రి కి అప్పగించారు. ఇరవై నాలుగు గంటల్లోనే బాలిక ను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన కొత్తగూడెం మూడవ పట్టణ పోలీస్ సిబ్బందికి, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా టీం కు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రా దేవి, మహమ్మద్ సాదిక్ పాషా లు అభినందించారు. పద్దెనిమిది సంవత్సరాల లోపు బాల బాలికలు ఒంటరిగా ఎక్కడ అయిన కనబడితే వారి సమాచారం వెంటనే ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలియ చేయలని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు తెలియ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :