Monday, 02 November 2026 11:30:50 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

సెలవుల్లో బడులు నడిపే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్.

Date : 08 October 2026 06:45 PM Views : 134

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సెలవుల్లో బడులు నడిపే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి.విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. నిబంధనలు మీరితే ప్రత్యక్ష ఆందోళనలు.ప్రత్యేక తనిఖీలతో అడ్డుకట్ట వేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్.దసరా సెలవు దినాల్లో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వరక అజిత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సెలవులను సైతం పట్టించుకోకుండా విద్యార్థులను పాఠశాలలకు రప్పించి తరగతులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. సెలవుల్లోనూ తరగతులు నడపడం వల్ల విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి పెరుగుతోందని, దీనివల్ల సెలవుల ప్రాథమిక ఉద్దేశమే దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంఈఓల ద్వారా అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు సెలవు దినాల పట్టికను పంపించి ముందస్తు ఆదేశాలు జారీ చేయాలన్నారు. పాఠశాలల తీరుపై తల్లిదండ్రులు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణ విచారణ జరిపించి విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ సెలవుల్లో పాఠశాలలను కొనసాగిస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్, జిల్లా సమితి సభ్యులు జుంజునూరి రాజ్ కమల్, నాయకులు దినేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :