Tuesday, 03 November 2026 12:52:06 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేయాలి : భద్రాద్రి జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మావతి.

Date : 24 September 2026 06:48 PM Views : 113

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేయాలి : భద్రాద్రి జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మావతి. ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు వేగవంతం చేసి ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించాలి. భద్రాద్రి ఐ.డీ.ఓ.సి లో జిల్లా సంప్రదింపుల కమిటీ (డీ.సీ.సీ) , జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీ.ఎల్.‌ఆర్‌.సీ) సమావేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిణి (డీ.ఆర్.ఓ) పద్మావతి ఆదేశించారు.2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశం గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించగా జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మావతి అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఎ.జీ.ఎం చిరంజీవి, రీజనల్ మేనేజర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నాగరాజు, వివిధ వా బ్యాంకుల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.ముఖ్యంగా ప్రాధాన్యతా రంగాల రుణాల లక్ష్యాలు, సాధించిన అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2026 జూన్ 30వ తేదీ నాటికి జిల్లాలో మొత్తం ప్రాధాన్యతా రంగంలో రూ.5702.78 కోట్ల వార్షిక లక్ష్యానికి గాను రూ.1578.08 కోట్లు మంజూరు చేసి 27.67 శాతం నమోదైనట్లు వెల్లడించారు.వ్యవసాయ రంగంలో రూ.4591.84 కోట్ల లక్ష్యానికి గాను రూ.1148.87 కోట్లు మంజూరు చేసి 25.01 శాతం నమోదైంది. ఇందులో పంట రుణాల కింద రూ.2405.6 కోట్ల లక్ష్యానికి గాను రూ.467.53 కోట్లు (19.44 శాతం), అగ్రి టర్మ్ లోన్స్ కింద రూ.1,479.1 కోట్ల లక్ష్యానికి గాను రూ.508.87 కోట్లు (34.4 శాతం), అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.44.73 కోట్ల లక్ష్యానికి గాను రూ.0.65 కోట్లు (1.45 శాతం), అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల కింద రూ.663.41 కోట్ల లక్ష్యానికి గాను రూ.171.83 కోట్లు (25.9 శాతం) మంజూరు చేసినట్లు వివరించారు.ఈ క్రమంలో ఎం.ఎస్.‌ఎం.ఈ రంగంలో రూ.888.98 కోట్ల లక్ష్యానికి గాను రూ.403.1 కోట్లు మంజూరు చేసి 45.34 శాతం నమోదైంది. విద్యా రుణాల కింద రూ.21.4 కోట్ల లక్ష్యానికి గాను రూ.3.44కోట్లు (16.07), గృహ రుణాల కింద రూ.35 కోట్ల లక్ష్యానికి గాను రూ.5.08 కోట్లు (14.51 శాతం) మంజూరు చేసినట్లు తెలిపారు. పీ.ఏం సూర్య ఘర్ పథకంలో రు.7.06 కోట్లు లక్ష్యానికి గాను 6.76 కోట్లు సాధించగా 95.75 శాతం నమోదైందని తెలిపారు.ఇతర విభాగాల్లో రూ.153.5 కోట్ల లక్ష్యానికి గాను రూ.10.82 కోట్లు మంజూరు చేసి 7.05 శాతం నమోదైనట్లు తెలిపారు.జిల్లాలో మూడు పోస్టాఫీస్ లు వేరే పోస్టాఫీస్ లో విలీనం అవుతున్నాయని తెలిపారు.అదేవిధంగా స్ట్రీట్ వెల్డర్లుకు గతంలో ఇచ్చిన రుణాలను రు.10 వేలు నుంచి రు.15వేలు పెంచి రుణాలను మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు వేగవంతం చేసి ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.రైతు రుణాల పంపిణీ అంశంపై బ్యాంకుల వారీగా పంట రుణాల పంపిణీ లక్ష్య సాధన తక్కువగా ఉన్న బ్యాంకుల అధికారులను కారణాలు డీ.ఆర్.ఓ అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ రుణాలను సకాలంలో పునరుద్ధరించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్లను ఆదేశించారు.రైతు భరోసా, ఆసరా పింఛన్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే నిధులను ఇతర రుణాల బకాయిల పేరుతో నిలుపుదల చేయరాదని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎం.ఎస్‌.ఎం.ఈ) రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అర్హులైన రైతులు, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన రుణ సహకారం అందించాలని డీ. ఆర్.ఓ కోరారు. జిల్లాలో ఉపాధి, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా బ్యాంకులు రుణాల పంపిణీలో మరింత చొరవ చూపాలని సూచించారు.స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధానం, నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) తగ్గింపు, ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన పీఎం స్వనిధి, పీఎంఈజీపీ, పీఎం ముద్ర, పీఎం విశ్వకర్మ, పీఎంఎఫ్‌ఎంఈ, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) అమలుపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను డీ. ఆర్.ఓ ఆదేశించారు.ఈ సమావేశంలో అడిషనల్ డీ. ఆర్.డీ. ఏ నీలేష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పశుసంవర్ధక శాఖ అధికారి మల్లయ్య, జిల్లా మత్స్యశాఖ కార్యాలయ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :