Monday, 02 November 2026 09:57:20 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

కాయకల్ప్‌ అవార్డుల్లో జిల్లాకు వంద శాతం విజయం: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 17 October 2026 05:08 PM Views : 133

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాయకల్ప్‌ అవార్డుల్లో జిల్లాకు వంద శాతం విజయం: జిల్లా కలెక్టర్ అంకిత్. ఐదు టీవీవీపీ ఆసుపత్రులకు అవార్డులు.. వైద్య సిబ్బందిని అభినందించిన కలెక్టర్.మారుమూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన వైద్య సేవలకు గుర్తింపు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాయకల్ప్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఐదు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆసుపత్రులూ అవార్డులు సాధించి వంద శాతం విజయాన్ని నమోదు చేయడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు . శనివారం ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ నందు కాయకల్ప్‌ అవార్డులు సాధించిన ఆసుపత్రుల బృందాలను కలెక్టర్ అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , పాత భవనాలు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమిస్తూ,అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, ఆసుపత్రుల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పేద, గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది సమష్టి కృషి, అంకితభావం ఈ విజయానికి కారణమని తెలిపారు .జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లందు, పాల్వంచ ఆసుపత్రులు కాయకల్ప్‌ అవార్డులు, ప్రశంసా పురస్కారాలు సాధించడం వైద్య సేవల నాణ్యతను పెంపొందించడంలో సిబ్బంది చేస్తున్న కృషికి నిదర్శనమని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా పాల్వంచ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు రాష్ట్రస్థాయి పర్యావరణహిత అవార్డు లభించడం జిల్లాకు గర్వకారణమన్నారు.మణుగూరు, అశ్వారావుపేట వంటి మారుమూల ప్రాంతాల్లోని ఆసుపత్రులు తొలి ప్రయత్నంలోనే అవార్డులు సాధించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు . అందుబాటులో ఉన్న పరిమిత వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, నిబద్ధతతో పనిచేస్తే నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు మరిన్ని గుర్తింపులు సాధించవచ్చని ఈ విజయం నిరూపిస్తోందన్నారు.ఆసుపత్రుల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వైద్య వ్యర్థాల నిర్వహణ, ఇన్‌ఫెక్షన్ల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో నిర్దేశిత ప్రమాణాలను నిరంతరం పాటించాలని కలెక్టర్ సూచించారు. కాయకల్ప్‌ అవార్డుల ద్వారా లభించిన గుర్తింపును స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, పేద, గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ మరిన్ని అవార్డులు సాధించాలని ఆసుపత్రుల బృందాలకు సూచించారు.ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్ జి. రవిబాబు, సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ రాధారుక్మిణి, డాక్టర్ గౌరీ ప్రసాద్, డాక్టర్ రామ్‌ప్రసాద్, డాక్టర్ సోమరాజ్ దారా, డాక్టర్ మౌనిక తదితరులతో పాటు నర్సింగ్, పారామెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. అవార్డుల సాధనకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ జిల్లా కలెక్టర్ అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :